Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఇట్టే కలసిపోతానంటున్న రష్మిక!
  • ఇటలీలో ప్రభాస్ కోసం అప్పటి కార్లు!
  • సాయిధరం తేజ్ సరసన 'హలో' నాయిక 
*  'ఎవరితోనైనా సరే నేను ఇట్టే కలసిపోతాను' అంటోంది హీరోయిన్ రష్మిక మందన. 'నేను చిన్నప్పటి నుంచీ ఎక్స్ ట్రావర్ట్ ని. కొత్త వాళ్లతో ఇట్టే కలసిపోతాను. ఆ లక్షణం నాకు సినిమా ఇండస్ట్రీలో బాగా ఉపయోగపడుతోంది. అందుకే సినిమా వాతావరణం, ఇక్కడి మనుషులు నాకు కొత్తగా అనిపించడం లేదు' అని చెప్పింది.
*  ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ ఇటలీలోని పలు లొకేషన్లలో జరుగుతోంది. ఎనభైల నాటి కాలంలో జరిగే రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో అప్పట్లో వాడుకలో వున్న వోక్స్ వేగాన్ బీటెల్ కార్లను, వ్యాన్లను షూటింగులో వాడుతున్నారట.
*  కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ నటించే చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. కాగా, ఇందులో కథానాయికగా 'హలో' ఫేం కల్యాణి ప్రియదర్శిన్ ను తీసుకున్నారు.   
Rashmika
Prabhas
pooja

More Telugu News