Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన రద్దు!

  • ఈ నెల 17న అమెరికా వెళ్లాల్సిన లోకేశ్ 
  • ప్రస్తుతం శ్రీకాకుళంలో పర్యటిస్తున్న మంత్రి
  • తుపాను ప్రభావం నుంచి కోలుకునేంత వరకు అక్కడే
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన రద్దు అయింది. ఈ నెల 17 నుంచి 19 వరకు ఆయన అమెరికాలో పర్యటించాల్సి ఉంది. అక్కడ నిర్వహించనున్న ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ కార్యక్రమంలో హాజరుకావాల్సి ఉంది. అయితే, ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుపాను కారణంగా అమెరికా పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.

తిత్లీ తుపాను దెబ్బకు ఉత్తరాంధ్ర ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయింది. ప్రస్తుతం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటిస్తున్నారు. తుపాను కారణంగా దెబ్బతిన్న గ్రామాలు పూర్తిగా కోలుకునే వరకు జిల్లాలోనే ఉండాలని మంత్రి నిర్ణయించారు. దీంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. మరో రెండు రోజులపాటు లోకేశ్ శ్రీకాకుళంలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తారని  అధికారులు తెలిపారు.
Nara Lokesh
Titli cyclone
America
Andhra Pradesh
Srikakulam District
Chandrababu

More Telugu News