bcci: లైంగిక వేధింపుల ఆరోపణలపై రాహుల్ జోహ్రీ వివరణకు బీసీసీఐ ఆదేశాలు
- జోహ్రీపై ఓ పాత్రికేయురాలు లైంగిక ఆరోపణలు
- వివరణ నివేదికను వారం రోజుల్లోగా సమర్పించాలి
- దీని ఆధారంగానే చర్యలు తీసుకుంటామన్న బీసీసీఐ
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ తనను వేధింపులకు గురిచేశారంటూ ఓ పాత్రికేయురాలు ఆరోపించడం, ఇందుకు సంబంధించిన మెయిల్స్ ను ఓ నెటిజన్ నిన్న షేర్ చేయడం తెలిసిందే. ఈ ఆరోపణలపై ఇంతవరకూ జోహ్రీ స్పందించలేదు. కానీ, ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ బీసీసీఐ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది.
దీనిపై వివరణ నివేదికను వారం రోజుల్లోగా సమర్పించాలని, దీని ఆధారంగానే ఆయనపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని బీసీసీఐ పాలకమండలి పేర్కొంది. కాగా, రాహుల్ జోహ్రీ తన మాజీ సహోద్యోగిగా ఉన్న సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధిత పాత్రికేయురాలు నిన్న ఆరోపించింది.