CM Ramesh: ఈ తాటాకు చప్పుళ్లకు నేను భయపడను: కేంద్రాన్ని హెచ్చరించిన సీఎం రమేశ్

  • ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు
  • ఎటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి లొంగం
  • కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఊరుకోం
ఐటీ దాడులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదని ఏపీ టీడీపీ నేత సీఎం రమేశ్ గట్టిగా చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్ లో ప్రశ్నించినందుకే తన నివాసాలపై ఐటీ దాడులు జరిగాయని, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.

ఈ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని అన్నారు. అధికారం ఉందని చెప్పి ఒత్తిడి చేసి తమను లొంగదీసుకోవాలని చూస్తారా? అని కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేంద్రానికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని ఈ ఐటీ దాడుల వ్యవహారాన్ని జాతీయస్థాయిలో తెలియజేస్తామని సీఎం రమేశ్ హెచ్చరించారు. 
CM Ramesh
Telugudesam
ir raids

More Telugu News