Janagama: యువతి ప్రతిఘటించడంతో బావిలోకి నెట్టాడు.. తనూ పడ్డాడు!

  • జనగామ జిల్లాలో ఘటన
  • ఇంటర్ యువతిని ఎత్తుకెళ్లిన యువకుడు
  • యువతి ప్రతిఘటించడంతో బావిలోకి నెట్టేసిన వైనం
తనకు ఒంటరిగా కనిపించిన యువతిని కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారయత్నం చేసిన ఓ యువకుడు వ్యవసాయ బావిలో పడిపోయిన ఘటన జనగామ జిల్లా జాఫర్ గడ్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఉప్పుగల్లు గ్రామంలో నివాసం ఉంటున్న కేసోజు రాజేష్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువతిని ఎత్తుకెళ్లాడు. ఊరి చివర ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి, ఆమెను రేప్ చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించగా, తన ప్రయత్నం బెడిసి కొట్టిందనుకుని, ఆమెను పక్కనే ఉన్న బావిలోకి నెట్టే క్రమంలో తాను కూడా పడిపోయాడు. బావిలో పడ్డ యువతి కేకలు వేస్తుండటంతో స్థానికులు వచ్చి ఆమెను బయటకు తీశారు. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించి, రాజేష్ ను కూడా బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. యువతి, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వర్దన్నపేట సీఐ కరుణాసాగర్ రెడ్డి వెల్లడించారు.
Janagama
Youth
Rape Attempt
Well
Police

More Telugu News