ETV: వివాదాస్పదమైన 'జబర్దస్త్' డైలాగులు.. ఫైర్ అవుతున్న 'జగిత్యాల' వాసులు!

  • పొట్టకూటి కోసం వెళ్లిన పేదలను అవమానించేలా స్కిట్
  • దుమారం రేపుతున్న తాజా స్కిట్
  • క్షమాపణలు డిమాండ్ చేస్తున్న జగిత్యాల వాసులు
మరో జబర్దస్త్ స్కిట్ తీవ్ర వివాదాస్పదమైంది. 'జగిత్యాల' అన్న బోర్డు పెట్టి చేసిన ఈ స్కిట్‌ లో అసభ్యకర డైలాగ్స్‌ ఉన్నాయని జగిత్యాల వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవినాశ్, కార్తీక్ కలసి చేసిన ఈ స్కిట్ లో అవినాశ్ తల్లి పాత్రను, కార్తీక్ కొడుకు పాత్రనూ చేశారు. ఉద్యోగం లేకుండా ఉన్న తన కుమారుడిని మందలిస్తూ,  "పక్కింటి సురేశ్ భార్యను వదలి గల్ఫ్ వెళ్లి పని చేసుకుంటున్నాడు. నువ్వు పడుకుని నిద్రపోతున్నావు" అని తల్లి అనగా, "వాడు జాబ్ చూసుకుంటున్నాడు, వాడి పెళ్లాన్ని నేను చూసుకుంటున్నాను" అన్న వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

 పొట్టకూటి కోసం పరాయి దేశాలకు వెళ్లి కష్టపడుతున్న పేదలను అవమానించేలా ఈ స్కిట్ ఉందని, వెంటనే జబర్దస్త్ నిర్వాహకులు, అవినాశ్ క్షమాపణలు చెప్పాలని జగిత్యాల వాసులతో పాటు హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, గత శుక్రవారం నాడు ఈ కార్యక్రమం ప్రసారమైంది.
ETV
Jabardast
Skit
Jagityala

More Telugu News