Nitya menon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తొలిసారిగా నిత్యామీనన్ హిందీ చిత్రం 
  • డిసెంబర్ నుంచి రాజమౌళి మల్టీ స్టారర్ 
  • విశాఖలో రామ్ చరణ్ చిత్రం షూటింగ్  
*  బొద్దుగుమ్మ నిత్యా మీనన్ ప్రస్తుతం 'ప్రాణ' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దక్షిణాది నాలుగు భాషలలోను విడుదల చేయడంతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీ వెర్షన్ ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా నిత్యామీనన్ పాల్గొంటుందట. హిందీలో ఇది ఆమెకు తొలి చిత్రం అవుతుంది.
*  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందే భారీ మల్టీ స్టారర్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుందని, ఆ లోగా రాజమౌళి నిర్వహించే వర్క్ షాప్ కి ఎన్టీఆర్, చరణ్ హాజరవుతారని సమాచారం.
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును విశాఖలో నిర్వహిస్తారు. ఇందుకోసం యూనిట్ విశాఖకు బయలుదేరి వెళ్లింది. ముందుగా సింహాచలం దేవాలయం పరిసరాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారట.
Nitya menon
Charan
ntr
Rajamouli

More Telugu News