gvl narasimharao: టీడీపీ ఎంపీలపై విమర్శలు గుప్పించిన జీవీఎల్

  • టీడీపీ ఎంపీలకు ఆర్భాటం ఎక్కువ.. అవగాహన తక్కువ
  • రాష్ట్ర ప్రయోజనాలపై శ్రద్ధ లేదు
  • జీఎస్ఐ ద్వారా అందజేయాల్సిన నివేదిక ఎందుకు ఆలస్యమైంది?
తెలుగుదేశం పార్టీ ఎంపీలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీలకు ఆర్భాటం చాలా ఎక్కువని... విషయాలపై అవగాహన తక్కువని ఎద్దేవా చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేందర్ సింగ్ ను కలిసే ముందు... జీఎస్ఐ ద్వారా అందజేయాల్సిన నివేదిక ఎందుకు ఆలస్యమైందో టీడీపీ ఎంపీలు తెలుసుకుంటే బాగుండేదని అన్నారు. అవినీతి, డ్రామాలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని అన్నారు. అవినీతిపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేదని చెప్పారు.

gvl narasimharao
Telugudesam
mp
bjp

More Telugu News