rgv: అతని ఆచూకీ తెలపమంటూ.. షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ!

  • అచ్చు చంద్రబాబులానే ఉన్న వ్యక్తి
  • ఎవరికైనా తెలిస్తే వివరాలు తెలపాలని విన్నపం
  • వివరాలు ఇచ్చే తొలి వ్యక్తికి లక్ష బహుమతి
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా షూటింగ్ ను దసరా రోజున ప్రారంభిస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈనెల 19న తిరుపతిలో వెల్లడిస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో రామ్ గోపాల్ వర్మ ఓ వ్యక్తికి సంబంధించిన వీడియోను పెట్టాడు. నిక్కర్, బనియన్ వేసుకున్న ఆయన అచ్చం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లానే ఉన్నారు. ఏదో హోటల్ లో భోజనాలు వడ్డిస్తున్నారు. 'ఈ వ్యక్తి ఎక్కడున్నారో కనుక్కోవడానికి ఎవరైనా నాకు సహకరించగలరా? ఈయన ఆచూకీ తెలిపిన తొలి వ్యక్తికి లక్ష రూపాయల బహుమతి ఇస్తా' అంటూ ట్వీట్ చేశారు. ఎవరికైనా తెలిస్తే [email protected] మెయిల్ ఐడీకి వివరాలు పంపించాలని కోరారు.  
rgv
Chandrababu
lakshmis ntr

More Telugu News