batukamma: బతుకమ్మ ఆడిన న్యూజిలాండ్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్

  • న్యూజిలాండ్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
  • తెలంగాణ మహిళలతో కలసి బతుకమ్మ ఆడిన జెసిండా
  • బతుకమ్మ వేడుకల్లో ఒక దేశ ప్రధాని పాల్గొనడం ఇదే తొలిసారన్న కేటీఆర్
తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేసుకునే బతుకమ్మ ఉత్సవాలు విదేశాల్లో సైతం వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణవాసులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్ లో జరిగిన బతుకమ్మ ఉత్సవాలకు సాక్షాత్తు ఆ దేశ ప్రధానమంత్రి జెసిండా అర్డెర్న్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలతో కలసి ఆమె బతుకమ్మ ఆడారు. న్యూజిలాండ్ లో ఉన్న తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి.

దీనికి సంబంధించి ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్న ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో ఒక దేశ ప్రధాని పాల్గొనడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలంగాణ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలిపారు.
batukamma
New Zealand
Jacinda Ardern
telangana association
KTR

More Telugu News