jenelia: లైంగిక వేధింపులపై జెనీలియా భర్త స్పందన!

  • మహిళల సమస్యలు ఎంతో బాధిస్తున్నాయి
  • బాధితులకు మద్దతు పలకాలి
  • వేధింపులకు గురైన వారికి నేను బాసటగా ఉంటా
లైంగిక వేధింపుల ఆరోపణలు బాలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. తమ జీవితంలో జరిగిన లైంగిక దాడులు, వేధింపుల గురించి బాలీవుడ్ కు చెందిన పలువురు మహిళలు 'మీటూ' ఉద్యమం ద్వారా బయటపెడుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో దర్శకుడు సాజిద్ 'హౌస్ ఫుల్-4' సినిమా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఈ  అంశంపై నటీ జెనీలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ, మన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని చెప్పారు. బాధితులకు మద్దతు పలకాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన వారికి తాను మద్దతుగా ఉంటానని చెప్పారు.
jenelia
riteesh deshmukh
meetoo
bollywood

More Telugu News