Jana Sena: జనసేనలోకి కృష్ణా జిల్లా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

  • కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన డీసీసీ ఉపాధ్యక్షుడు రమేష్‌బాబు
  • పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరుతానని వెల్లడి
  • తనతో పాటు మరికొందరు పార్టీ మారుతున్నట్లు ప్రకటన
శుకవ్రారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ బాటలోనే కృష్ణా జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత కూడా నడవాలని నిర్ణయించుకున్నారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో వివిధ స్థాయుల్లో సేవలందిస్తూ, ప్రస్తుతం డీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న చలమలశెట్టి రమేష్‌బాబు తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.

 జనసేన విధానాలు నచ్చి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించారు. తనతోపాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాంగ్రెస్‌ను వీడి జనసేనలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతామని చెప్పారు. 
Jana Sena
Vijayawada
Chalamalasetty

More Telugu News