Mamata banerjee: దుర్గాపూజ కోసం పాటలు రాసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పూజా ఆల్బమ్ ‘రౌద్రాచార్య’తో భక్తుల ముందుకు!

  • కొత్త ఆల్బంను విడుదల చేసిన మమతా బెనర్జీ
  • ఏడు పాటలు రాసిన సీఎం
  • గాత్రమిచ్చిన బెంగాలీ ప్రముఖ గాయకులు
దసరా సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనలోని సృజనాత్మకతను బయటపెట్టారు. దుర్గా పూజ కోసం స్వయంగా ఏడు పాటలు రాశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన కొత్త ఆల్బమ్ ‘రౌద్రాచార్య’లోని పాటలన్నింటినీ తానే రాసినట్టు పేర్కొన్నారు.

 సీఎం రాసిన పాటలను బెంగాలీ ప్రముఖ గాయకులు ఇంద్రనీల్, లోపముద్ర, రూపాంకర్‌ పాడారు. తాను రాసిన పాటల లింక్‌ను కూడా మమత ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వాటిని విని ఆనందించాల్సిందిగా కోరారు. పశ్చిమబెంగాల్‌లో దుర్గాపూజ ఉత్సవాలు ఈనెల 14న ప్రారంభమై 19 వరకు కొనసాగనున్నాయి.
Mamata banerjee
Roudracharya
Durga puja
Kolkata
West Bengal

More Telugu News