Jana Sena: ‘జనసేన’లో చేరిన నాదెండ్ల... మనోహర్ తనకు అన్న లాంటివారన్న పవన్ కల్యాణ్

  • నాదెండ్లను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన పవన్
  • బలమైన ఆలోచన, లోతైన విశ్లేషణ ఉన్న వ్యక్తి
  • మా ఇద్దరికి చాలా కాలంగా పరిచయం ఉంది: పవన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అసెంబ్లీ మాజీ స్పీకర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ ఈరోజు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ను పార్టీలోకి పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, మనోహర్ తనకు అన్నలాంటివారని, బలమైన ఆలోచన, లోతైన విశ్లేషణ ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు.

తమ ఇద్దరికీ చాలా కాలంగా పరిచయం ఉందని, గత నాలుగేళ్లలో తాను ఆయా మీటింగ్స్ లో తప్పు మాట్లాడినా, ఒప్పు మాట్లాడినా తనకు ఫీడ్ బ్యాక్ ఇచ్చేవారని, తమ మధ్య స్నేహం ఉందని చెప్పారు. ‘జనసేన’లోకి రావాలని గతంలో ఓసారి కోరానని, పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని మనోహర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ‘జనసేన’లోకి రావాలనిపిస్తుందో అప్పుడే రమ్మనమని చెప్పానని గుర్తుచేసుకున్నారు.
Jana Sena
Pawan Kalyan
badendla manohar

More Telugu News