Rajamouli: ‘అరవింద సమేత’ఫై రాజమౌళి స్పందన

  • అది సాహసమైన నిర్ణయమేనని చెప్పాలి
  • చాలా బాగా వర్కవుట్ అయింది
  • తారక్ నటన చాలాకాలం గుర్తుండిపోతుంది
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘అరవింద సమేత’. ఈ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలి ఆటతోనే ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. భారీ డైలాగులు, హాస్యాన్ని పక్కనబెట్టి తొలిసారి త్రివిక్రమ్ కథనే నమ్మి చేసిన ప్రయత్నానికి ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు.

ఈ సినిమాను చూసిన దర్శకధీరుడు రాజమౌళి తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘ఒక యుద్ధం ముగిసిన తరువాత ఒక ప్లాట్ పాయింట్‌తో సినిమాను నడిపించడమనేది త్రివిక్రమ్ తీసుకున్న సాహసమైన నిర్ణయమనే చెప్పాలి. అది చాలా బాగా వర్కవుట్ అయింది. ఆ సీన్‌లో తారక్ నటన చాలా కాలం గుర్తుండిపోతుంది. జగపతి బాబు గారి నటన అద్భుతం. అరవింద సమేత టీం మొత్తానికి శుభాకాంక్షలు’’ అని జక్కన్న ట్వీట్ చేశారు.  
Rajamouli
Aravinda Sametha movie
Junior Ntr
Jagapathi Babu
Trivikram

More Telugu News