padminireddy: దేని కోసం ఈ నాటకం?: పద్మినీరెడ్డిపై బీజేపీ నేత, సినీ నటి మాధవీలత మండిపాటు

  • పార్టీలో చేరబోయే ముందు ఆలోచన లేదా?
  • పసిపిల్లలా? పాలు తాగుతున్నారా?
  • ఇలాంటి వాటిని కోవర్ట్ పాలిటిక్స్ అంటారు

టీ-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్శింహ సతీమణి పద్మినీరెడ్డి నిన్న ఉదయం బీజేపీలో చేరి కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యపరచడం.. తిరిగి సాయంత్రం అంతే వేగంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయి .. ఈసారి బీజేపీ శ్రేణులను ఆశ్చర్యపరచడం సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత స్పందించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో లో ఓ పోస్ట్ చేశారు.

‘పొద్దున్నే మోదీ జీ ఐడియాలజీ సూపర్.. సాయంత్రం అయ్యేసరికి పోయింది. చేరబోయే ముందు ఆలోచన లేదా? పసిపిల్లలా? పాలు తాగుతున్నారా, ఏమీ తెలియకపోవడానికి. పద్మినీ రెడ్డి గారూ చాలా గొప్ప ప్లాన్ తో కోవర్ట్ పాలిటిక్స్ చెయ్యడానికి బీజేపీ లోకి అడుగువేశారు.

మోదీ గారి పాలన నచ్చిందా? లేక వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్లాన్స్ తెలుసుకొని ద గ్రేట్ డియర్ హజ్బెండ్ ఉన్న పార్టీలో చెప్పడానికా? దేనికోసం ఈ నాటకం? నమ్మి ఘనంగా వెల్ కమ్ చెప్పడం బీజేపీ తప్పు కాదు. ఇలాంటి వాటిని కోవర్ట్ పాలిటిక్స్ అంటారు. ఇవి చెయ్యడం ఒక కాంగ్రెస్ కి మాత్రమే చెల్లుతుంది. ఇలాంటి ఉడతా జంప్స్ కి బీజేపీ కదిలేది లేదు. మోదీ జీ వణికేది లేదు’ అని తన పోస్ట్ లో మాధవి విరుచుకుపడ్డారు.

 

  • Error fetching data: Network response was not ok

More Telugu News