poonam pandey: శక్తి కపూర్ తో పని చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా: పూనం పాండే

  • 'ది జర్నీ ఆఫ్ కర్మ' చిత్రంలో శక్తితో కలసి నటించిన పూనం
  • లైవ్ చాట్ లో శక్తి కపూర్ గురించి సంచలన వ్యాఖ్యలు
  • పదేళ్ల తర్వాత ఈ విషయం గురించి మాట్లాడబోనన్న పూనం
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఎన్నో బోల్డ్ ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. తాజాగా సీనియర్ యాక్టర్ శక్తి కపూర్ తో కలసి ఆమె నటించిన 'ది జర్నీ ఆఫ్ కర్మ' అనే చిత్రం ఈనెల 26న విడుదల కాబోతోంది.

ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా అభిమానులతో సోషల్ మీడియాలో ఆమె లైవ్ చాట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు బదులుగా ఆమె సంచలన సమాధానాన్ని ఇచ్చింది. షూటింగ్ సమయంలో శక్తి కపూర్ తో కలసి పని చేయడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఇదే సమయంలో చిత్ర దర్శకుడి వైపు చూస్తూ... పదేళ్ల తర్వాత తాను ఈ అంశాన్ని లేవనెత్తబోనని... భయపడాల్సిన అవసరం లేదని సరదాగా చెప్పింది. (పదేళ్ల తర్వాత నానాపై తనుశ్రీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే). మరోవైపు, తనుశ్రీ దత్తా, నానా పటేకర్ వివాదం గురించి మాట్లాడటానికి ఆమె నిరాకరించింది.

తెలుగులో పూనమ్ పాండే 'మాలిని అండ్ కో' చిత్రంలో నటించింది. ఈ సినిమాలో సామ్రాట్, సుమన్, జీవా తదితరులు నటించారు. 
poonam pandey
shakthi kapoor
the journey of karma
bollywood

More Telugu News