Saloni chopra: బాలీవుడ్ దర్శకుడిపై సంచలన ఆరోపణలతో బయటకొచ్చిన సలోనీ చోప్రా!

  • డైరెక్టర్ సాజిద్ ఖాన్ వేధించాడు
  • జీవితంలో అదో భయంకర అనుభవం
  • అసభ్య ప్రశ్నలడిగాడు
  • అవకాశం కోసం గదిలోకి రమ్మన్నాడు
  • సాజిద్ చాలా మందినే వేధించాడన్న సలోనీ
'మీటూ' ఉద్యమం ప్రారంభమైన తరువాత, సినీ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి ఒక్కొక్కరూ బయటకు వచ్చి తమ అనుభవాలను చెప్పుకుంటున్న వేళ, బాలీవుడ్ నటి సలోని చోప్రా, డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఏడేళ్ల క్రితం సాజిద్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా తాను పనిచేశానని గుర్తు చేసుకున్న సలోనీ, ఆ సమయం తన జీవితంలోనే ఓ భయంకర అనుభవమని, దాని గురించి బయటకు చెప్పే సమయం ఇప్పుడు వచ్చిందని వ్యాఖ్యానించింది.

"ఇంటర్వ్యూ సమయంలోనే నాపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. స్వీయ సంతృప్తి పొందుతావా? వారానికి ఎన్నిసార్లు? వంటి ప్రశ్నలు అడిగాడు. బికినీ ఫొటోలు అడిగాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన తరువాత చుక్కలు చూపించాడు. నటీమణులు దుస్తులు మార్చుకునే గదుల్లోకి వెళ్లి, వారి డ్రస్ తీసి చూపించాలని అడిగేవాడు. నేను అడ్డుకుందామని చూస్తే బయటకు పంపించేవాడు. సినిమాల్లో అవకాశం కావాలంటే, తన గదిలోకి రావాలని కోరేవాడు. నన్ను వాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. చాలా మందిని సాజిద్ ఇలానే వాడుకున్నాడు. ఇవి బయట పెట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాను" అని సలోనీ చెప్పింది.
Saloni chopra
Sajid Khan
MeToo
Harrasment
Bollywood

More Telugu News