pranay amtrutha: 21వ తేదీకి వాయిదాపడిన ప్రణయ్‌ సంస్మరణ సభ

  • ఈనెల 14న నిర్వహించాలని తొలుత నిర్ణయం
  • అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు కమిటీ ప్రకటన
  • ప్రణయ్‌, అమృత మద్దతుదారులు తరలిరావాలని పిలుపు
పరువు హత్యకు గురైన ప్రణయ్‌ కుటుంబానికి మద్దతుగా తరలిరావాలని న్యాయపోరాట సంఫీుభావ కమిటీ పిలుపునిచ్చింది. ఈనె 14వ తేదీన నిర్వహించాలనుకున్న సంస్మరణ సభ అనివార్య కారణాల వల్ల 21వ తేదీకి వాయిదా పడిందని, మార్పును గమనించాలని కోరింది. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న అక్కసుతో అమృత తండ్రి నియమించిన కిరాయి మూక చేతిలో ప్రణయ్‌ హత్యకు గురైన విషయం తెలిసింది.

ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ హత్యోదంతాన్ని ఖండిస్తూ ఈనెల 14వ తేదీన ప్రణయ్‌ మద్దతుదారులతో సంస్మరణ సభ నిర్వహించాలని అమృత-ప్రణయ్‌ న్యాయపోరాట సంఫీుభావ కమిటీ నిర్ణయించింది. ఈ సభ 21న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరుగుతుందని, ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత పీడిత, బహుజన, కుల పోరాట, కుల నిర్మూలన సంఘాల ప్రతినిధులతోపాటు ప్రజాస్వామికవాదులు, మేధావులు హాజరవుతారని తెలిపారు.
pranay amtrutha
miryalaguda

More Telugu News