Shardhul Thakur: అరంగేట్రం చేసిన నిమిషాల్లోనే గాయపడ్డ శార్థూల్ ఠాకూర్... బాధతో పెవిలియన్ కు!

  • వెతుక్కుంటూ వచ్చిన అవకాశం
  • టెస్టుల్లో నేడు శార్థూల్ అరంగేట్రం
  • పది బంతులు వేయగానే గాయం
వెతుక్కుంటూ వచ్చిన అవకాశం అంతలోనే చేజారిపోతే... ఇప్పుడు శార్ధూల్ ఠాకూర్ పరిస్థితి అలాగే తయారైంది. టీమిండియా టెస్టు జట్టులో స్థానం కోసం ఎంతో కాలం ఎదురుచూసిన యువ ఫాస్ట్ బౌలర్ శార్థూల్ కు, నేడు తొలి మ్యాచ్ ఆడటం ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది.

అయితే, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. రెండో ఓవర్ నాలుగో బంతి వేస్తున్న సమయంలో శార్థూల్ గాయపడ్డాడు. అతని చీలమండ గాయం తిరగబెట్టడంతో, మైదానంలోనే విలవిల్లాడాడు. ఫిజయో, కెప్టెన్ కోహ్లీ సూచన మేరకు బాధతో మైదానం వీడి వెళ్లాడు. కేవలం 10 బంతులేసి మైదానం వీడుతున్న శార్ధూల్ ను చూస్తున్న ప్రేక్షకులు సైతం అయ్యో పాపం అనుకున్నారు.
Shardhul Thakur
India
Hyderabad
Cricket

More Telugu News