New Born: 'డ్రై బ్లడ్ స్పాట్'... మూడు చుక్కల రక్తంతోనే 50 రోగాల నిర్ధారణ!

  • చిన్నారుల్లో అంత సులువుగా బయటపడని వ్యాధులు
  • ముందే గుర్తించేందుకు అందుబాటులోకి వచ్చిన పరీక్ష
  • ప్రాణాలు కాపాడవచ్చంటున్న వైద్యులు
పిల్లలు జన్మించగానే, వారిలో దాగున్న రుగ్మతలను పసిగట్టడం చాలా కష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. వారు పెరుగుతూ, వ్యాధి ముదిరిన తరువాతే జబ్బు గురించి తెలుస్తుంది. ఈలోగా ప్రాణాలు కోల్పోయేవారెందరో. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన 'డ్రై బ్లడ్ స్పాట్' పరీక్షలో భాగంగా బిడ్డ పుట్టగానే మూడు చుక్కల రక్తం తీసుకుని, రెండు నుంచి మూడు రోజుల్లో 50 వరకూ రోగాలను గుర్తించే పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తమిళనాడు, కేరళ, గోవాల్లో నిర్వహిస్తున్నారని, తొలిసారిగా హైదరాబాద్ లోనూ అందుబాటులోకి వచ్చిందని బర్త్ ప్లేస్ ఆసుపత్రి వైద్యుడు రాజేష్ ఖన్నా వెల్లడించారు.
New Born
Dry Blood Spot
Health

More Telugu News