CM Ramesh: ప్రశ్నిస్తే సోదాలు, దాడులా?: నిప్పులు చెరిగిన సీఎం రమేష్

  • నేను లేని సమయంలో దాడులేంటి?
  • నా లావాదేవీలన్నీ పారదర్శకం
  • బీజేపీవి కుట్ర పూరిత రాజకీయాలన్న సీఎం రమేష్
భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలను తన చెప్పు చేతల్లో పెట్టుకుందని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ నిప్పులు చెరిగారు. ఐటీ దాడులపై తాను సమాచారం అడిగిన మూడు రోజుల్లోనే తన ఇంటిపై దాడులకు వచ్చారని, అది కూడా తాను న్యూఢిల్లీలో ఉన్న సమయంలో కడప, హైదరాబాద్ లోని ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఆదాయపు పన్ను శాఖకు తాను పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నానని, తన కంపెనీలు పూర్తి పారదర్శక లావాదేవీలను నడుపుతాయని ఆయన చెప్పారు. కాగా, సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు చేస్తున్న అధికారులు, ఆస్తుల పత్రాలను, ఇతర డాక్యుమెంట్లను, ఆయన నిర్వహిస్తున్న పలు కాంట్రాక్టులకు చెందిన దస్త్రాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
CM Ramesh
IT Raids
Hyderabad
Kadapa
BJP

More Telugu News