padminireddy: మనసు మార్చుకుంటున్నా.. తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగుతా!: పద్మినీరెడ్డి

  • కాంగ్రెస్ కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకున్నా
  • అందుకే, నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా
  • ఇంత ప్రతిస్పందన ఉంటుందని ఊహించలేదు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి ఈ రోజు ఉదయం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నేత లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్న ఆమె ఇప్పుడు మనసు మార్చుకున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ ఈరోజు రాత్రి ఆమె సంచలన ప్రకటన చేశారు.

 ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకున్నానని, అందుకే, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఇంత ప్రతిస్పందన ఉంటుందని తాను ఊహించలేదని, బీజేపీలోకి వెళ్లడం అనుకోకుండా జరిగిన సంఘటనని చెప్పారు.
padminireddy
Congress
bjp

More Telugu News