KTR: ఎన్ని స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు వస్తాయో లెక్కపెట్టి..ఆ లెక్క మీకు పంపిస్తాం: కేటీఆర్ సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలోని 119 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని అమిత్ షా ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. వేములవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు వస్తాయో లెక్కపెడతామని, ఆ లెక్కను అమిత్ షాకు పంపుతామని సెటైర్లు వేశారు. అమిత్ షా చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారని, మణిపూర్, మిజోరాంలలో గెలవలేదా అని చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని, సెక్యులర్ భావాలుండే ప్రజలని, రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామంటే ఇక్కడ మీ ఆటలు సాగవని, అమిత్ షా ‘షో’ లు ఇక్కడ నడవవని, ఉన్న 5 సీట్లు తెచ్చుకుంటే బీజేపీకి అదే గొప్ప అని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
KTR
amitshar
vemulavada

More Telugu News