KTR: పనికిమాలిన ప్రతిపక్షాలకు మేము జవాబుదారీ కాదు: మంత్రి కేటీఆర్

  • ప్రజలకు కచ్చితంగా సమాధానం చెబుతాం
  • వేములవాడను అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్ దే
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ప్రజలు మళ్లీ దీవించాలి
ఈ పనికిమాలిన ప్రతిపక్షాలు చేసే విమర్శలకు తాము జవాబుదారీ కాదని, ప్రజలకు సమాధానం చెబుతామని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వేములవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రజలు మళ్లీ దీవిస్తే ఉద్ధృతంగా ప్రజా సేవ చేస్తామని అన్నారు.

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ పుణ్యక్షేత్రాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. గతంలో ఈ ఆలయం గురించి పట్టించుకోని వాళ్లు, మొక్కులు చెల్లించుకుని బయటపడ్డ వాళ్లు, వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు అర పైసా కూడా కేటాయించని వాళ్లు దీని గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 
KTR
Congress
Telugudesam
bjp

More Telugu News