TRS: షాద్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచార రథంపై దాడి

  • గంట్లవెల్లి తండా పరిధిలో టీఆర్ఎస్ ప్రచారం
  • తాగునీటి సమస్య పరిష్కరించలేదని గ్రామస్తుల ఆగ్రహం
  • ప్రచార రథాన్ని ధ్వంసం చేసి..ఫ్లెక్సీల చింపివేత
ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి వెళ్లిన టీఆర్ఎస్ ప్రచార రథంపై ఈరోజు దాడి జరిగింది. ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి తండా పరిధిలో టీఆర్ఎస్ ప్రచార రథంపై గ్రామస్తులు ఈ దాడి చేశారు. తండాలో తాగునీటి సమస్య పరిష్కారంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.

తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ నేతలను కలిసి ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రచార రథాన్ని చుట్టుముట్టి ధ్వంసం చేసిన గ్రామస్తులు, దానికి ఉన్న ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు యువకులు కల్పించుకుని గ్రామస్థులతో మాట్లాడటంతో పరిస్థితి చక్కబడింది.
TRS
shadnagar
prachara radham

More Telugu News