Telangana: నాంపల్లి కోర్టుకు హాజరైన టీఆర్ఎస్ నేత బాల్క సుమన్!

  • ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి కేసు 
  • అనంతరం మీడియాతో ముచ్చటించిన నేత
  • కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే సంతోషమేనని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నేత, పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆందోళనల్లో పాల్గొనడంతో బాల్క సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఈ  రోజు పార్టీ నేతలు, అనుచరులతో కలిసి సుమన్ న్యాయస్థానం ముందు హాజరయ్యారు.

అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ ముందు కేసులు అసలు లెక్కలోకే రావని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం 13 ఏళ్ల పాటు పోరాడామనీ, దాని కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తే తనకు సంతోషమేనని వ్యాఖ్యానించారు. అనంతరం అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Telangana
TRS
BALKA SUMAN
NAMPALLY COURT

More Telugu News