kaushal: సమయం వచ్చినప్పుడు నూతన్ నాయుడు గురించి మాట్లాడతాను: కౌశల్

  • 'బిగ్ బాస్ 2' ఎపిసోడ్స్ ఇంకా చూడలేదు 
  • త్వరలోనే ఆ ఎపిసోడ్స్ చూస్తాను 
  • కొన్ని విషయాల్లో క్లారిటీ రావలసి వుంది  
'బిగ్ బాస్ 2' హౌస్ లోని 16 మందిలో నూతన్ నాయుడు ఒకరుగా ఉండేవారు. కొన్ని కారణాల వలన రెండుసార్లు ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లి వచ్చారు. హౌస్ లో ఉన్నంత సేపు ఆయన కౌశల్ కి మద్దతు తెలుపుతూ ఉండేవారు. ఆయన హౌస్ లో నుంచి బయటికి వెళ్లినప్పుడు కౌశల్ చాలా బాధపడ్డాడు కూడా. ఆ తరువాత కౌశల్ టైటిల్ గెలుచుకుని బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి కూడా కౌశల్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో నూతన్ నాయుడు గురించి అడగగా కౌశల్ తనదైన శైలిలో స్పందించాడు. "నూతన్ నాయుడు గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. 'బిగ్ బాస్ 2'కి సంబంధించిన ఎపిసోడ్స్ ను నేను ఇంతవరకూ చూడలేదు. ఇప్పుడే నూతన్ నాయుడు గురించి ఒక అభిప్రాయానికి రాలేను. కొన్ని ఎపిసోడ్స్ చూసిన తరువాత ఆయన గురించి మాట్లాడతాను. నాకు తెలియకుండా హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనల విషయంలో కొంత క్లారిటీ రావలసి ఉంది .. ఆ తరువాత నూతన్ నాయుడు గురించి మాట్లాడితే బాగుంటుంది" అని స్పష్టం చేశాడు.   
kaushal
nuthan nayudu

More Telugu News