jaipal reddy: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. లోక్ సభ కు వెళ్లిపోతా!: జైపాల్ రెడ్డి

  • ఈ విషయం హైకమాండ్ కు ఇప్పటికే చెప్పా
  • సీఎం అవుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • ఖండించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నేత జైపాల్ రెడ్డి తెలిపారు. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికల్లోనే తాను పోటీ చేస్తాననీ, ఈ విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కు ఇప్పటికే చెప్పానని వెల్లడించారు.

ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తాను సీఎం అవుతానని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని జైపాల్ రెడ్డి అన్నారు. తనకు అలాంటి ఉద్దేశాలు ఏవీ లేవనీ, తాను పార్లమెంటుకు వెళ్లిపోతానని స్పష్టం చేశారు.

కాగా, సినీ, రాజకీయ వర్గాలను కుదిపేస్తున్న మీ టూ ఉద్యమంపై జైపాల్ రెడ్డి స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత విదేశాంగ సహాయమంత్రి, మాజీ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ రాజీనామా చేయాలని నిన్న డిమాండ్ చేశారు. అక్బర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కోరారు.
jaipal reddy
Telangana
Congress
Chief Minister
high command

More Telugu News