Vizag: విశాఖ నుంచి విమానాలన్నీ రద్దు... ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు!

  • విశాఖపై తిత్లీ ప్రభావం
  • భారీ వర్షాలు, దట్టమైన మేఘాలు
  • ఇండిగో, ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు
ఈ ఉదయం తిత్లీ తుపాను తీరం దాటిన తరువాత, దాని ప్రభావం విశాఖ జిల్లాపైనా పడింది. విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తూ ఉండటం, ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోవడంతో ఈ ఉదయం విశాఖ నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లాల్సిన ఇండిగో సర్వీసు రద్దయింది. దీంతో దాన్ని విశాఖలో అందుకోవాల్సిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో పడిగాపులు పడుతున్నారు. విశాఖ చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా సర్వీసు కూడా రద్దయింది. విమాన సర్వీసులను మధ్యాహ్నం వరకూ రద్దు చేశామని, ఆపై పరిస్థితిని సమీక్షించి సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు.
Vizag
Airport
Indigo
Air India
Cancel

More Telugu News