Chandrababu: చంద్రబాబో, లోకేశో నన్ను తిట్టొచ్చు కదా? మంత్రి జవహర్ తో ఎందుకు తిట్టించడం?: పవన్ కల్యాణ్

  • ఏ కులం నుంచి వచ్చానో అదే కులం వారితో తిట్టిస్తారు
  • జవహర్ గారితో నన్ను తిట్టిస్తారు..దానర్థమేంటి?
  • పవన్ ఎస్సీ కులానికి వ్యతిరేకమని చెప్పడానికా?
ఒక మంత్రిని గానీ, ఎమ్మెల్యేను గానీ తాను వేలెత్తి చూపించినప్పుడు ఆ మరుసటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తనను తిట్టరని, తాను ఏ కులం నుంచి వచ్చానో అదే కులానికి చెందిన గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావునో వాడతారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరులో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘లోకేశ్ గారు నన్ను తిట్టరు, చాలా మంచిగా ‘ఆయనంటే మాకు చాలా ఇష్టం’ అని మాట్లాడతారు. నేను ఏ కులం నుంచి వచ్చానో ఆ కులం వారితో నన్ను తిట్టిస్తారు. లేదంటే, ప్రతి నియోజకవర్గంలో ఉండే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ వ్యక్తుల చేత తిట్టిస్తారు.

అలాగే, నన్ను తిట్టే  తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్లో మంత్రి జవహర్ గారు కూడా ఒకరు. మంత్రి జవహర్ గారు తిట్టే బదులు ముఖ్యమంత్రి గారు నన్ను తిట్టొచ్చు కదా, వాళ్లబ్బాయి లోకేశ్ తిట్టొచ్చు కదా, దేవినేని ఉమ గారు తిట్టొచ్చు కదా? వాళ్లెవ్వరూ నన్ను తిట్టరు.. జవహర్ గారితో తిట్టిస్తారు. మరి, దానర్థం ఏంటి? నువ్వు (పవన్) ఎస్సీ కులానికి వ్యతిరేకమని చెప్పడానికా? కులాల మధ్య చిచ్చు పెట్టడానికా? నేను ఎవరినైనా కులాలుగా చూడను. ప్రజలను రిప్రజెంట్ చేసే ప్రజాప్రతినిధులుగానే వారిని చూస్తాను, వారు ఏ కులమైనప్పటికీ’ అని అన్నారు.
Chandrababu
lokesh
Pawan Kalyan

More Telugu News