Harish Rao: ‘కాంగ్రెస్’ అధికారంలో కొస్తుందని హరీశ్ రావు తేల్చేశారు: కేసీఆర్ కు ఉత్తమ్ లేఖ

  • టీఆర్ఎస్ ఓటమిని ముందుగానే అంగీకరించారు
  • అందుకు హరీశ్ కు ధన్యవాదాలు
  • కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యే సమయమొచ్చింది
తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ప్రశ్నిస్తూ టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి హరీశ్ రావు నిన్న బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ ఈరోజు ఓ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తుందని హరీశ్ రావు నిన్న తనకు రాసిన లేఖలో తేల్చేశారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమిని హరీశ్ రావు ముందుగానే అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యే సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకుని, మూఢనమ్మకాలతో  టీఆర్ఎస్ పాలించిందని, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించనుందని ఆ లేఖలో పేర్కొన్నారు.  
Harish Rao
kcr
Uttam Kumar Reddy

More Telugu News