Amith shah: కొడుకునో, కూతురినో సీఎంని చేస్తారు తప్ప దళితుడ్ని మాత్రం సీఎంని కానివ్వరు: కేసీఆర్ పై అమిత్ షా విమర్శలు

  • దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు
  • 2018లో కూడా దళితుడ్ని సీఎంని చేయరు
  • వాగ్దానాల్లో, అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం

కేసీఆర్ తన తదనంతరం కొడుకునో, కూతురినో సీఎంని చేస్తారు తప్ప దళితుడ్ని మాత్రం సీఎంని కానివ్వరు అని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. కరీంనగర్‌లో జరిగిన బీజేపీ తొలి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

‘‘కేసీఆర్ గారు గతంలో ‘తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే నేను దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తా’ అని వాగ్దానం చేశారు. కానీ 2014 తర్వాత ఆ వాగ్దానాన్ని ఆయన నిలుపుకోలేదు. 2018లో కూడా బహుశా ఆయన దళిత వ్యక్తిని సీఎంని చేయరు. కానీ ఎప్పుడైనా కేసీఆర్ గారు, మీరు ముఖ్యమంత్రి పదవి కాదనుకున్నాక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తారా? అని నేను ప్రశ్నిస్తున్నా.

తన తదనంతరం కూడా దళితుడ్ని సీఎంని చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు. అప్పుడు కూడా తన కొడుకు, లేదంటే కూతుర్ని సీఎంని చేయాలనే యోచనతోనే ఆయన ఉన్నారు. ఒక్క ఈ విషయంలోనే కాదు.. అన్ని వాగ్దానాల్లోనూ, అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైందనేది మనందరికీ తెలుసు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

More Telugu News