nikhil: నిఖిల్ ట్వీట్ .. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహం!

  • చిత్రపరిశ్రమ సముద్రం వంటిది 
  • కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తుంటారు
  • తనతో తాను పోటీపడాలి
ప్రస్తుతం నిఖిల్ 'ముద్ర' సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఆయన ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. "ఈ ప్రపంచం తమ చుట్టూ తిరుగుతుందని భావిస్తోన్న వారిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేస్తున్నాను. వాళ్లు అనవసరమైన యాటిట్యూడ్ ను ప్రదర్శిస్తూ వుంటారు. కానీ నువ్వు అంత ముఖ్యమైనవాడివి కాదు. ప్రతి నటుడు తనతో తాను పోటీపడాలి.

సినిమా నిర్మాణమనే మహా సముద్రంలో మనం నీటి బొట్ల వంటి వాళ్లం. ఇక్కడ హైప్ తక్కువ ప్రదర్శించాలి .. పని ఎక్కువ చేయాలి" అని అన్నాడు. నిఖిల్ ప్రత్యేకించి ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, విజయ్ దేవరకొండను ఉద్దేశించే ఆయన అలా అన్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండను సపోర్ట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు నిఖిల్ ను విమర్శిస్తుంటే, మరికొంతమంది నిఖిల్ కి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.      
nikhil

More Telugu News