Amit sha: తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్‌ చేరుకున్న అమిత్‌ షా

  • నాంపల్లి సభలో ప్రసంగించనున్న బీజేపీ చీఫ్‌
  • అనంతరం కరీంనగర్‌కు ప్రయాణం
  • అక్కడ అంబేడ్కర్‌ మైదానంలో జరిగే 'సమరభేరి'లో పాల్గొంటారు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న తెలంగాణలో పార్టీ తరపున ఆయన ప్రచారం చేయనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఆయా నియోజక వర్గాల బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆయన నేరుగా కరీంనగర్‌ వెళ్తారు. అక్కడ అంబేడ్కర్‌ మైదానంలో నిర్వహించే 'సమరభేరి'లో పాల్గొంటారు.

ఒకప్పుడు బీజేపీకి కరీంనగర్‌లో జిల్లాలో మంచి పట్టుండేది. ఆ వైభవాన్ని తిరిగి సాధించాలన్న పట్టుదలతో బీజేపీ చీఫ్‌ ఉన్నారు. ఇందుకోసం అవసరమైన వ్యూహరచన  చేస్తారని భావిస్తున్నారు. గతంలో పట్టు సాధించిన నియోజకవర్గాలన్నింటా పాగా వేయాలని భావిస్తున్నారు. అమిత్‌ షా సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌ షాకు పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎంపీ దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావులు ఘనంగా స్వాగతం పలికారు.
Amit sha
electioncampain
BJP

More Telugu News