Aravinda Sameta: త్రివిక్రమ్ బెస్ట్... ఎన్టీఆర్ ఎక్సలెంట్... 'అరవింద సమేత' రివ్యూలో ఉమైర్ సంధూ!

  • దుబాయ్ లో పూర్తయిన సెన్సార్
  • క్లైమాక్స్ అద్భుతమన్న ఉమైర్
  • ఎన్టీఆర్ అద్భుతాన్ని చేశాడని కితాబు
రేపు విడుదల కానున్న ఎన్టీఆర్ కొత్త చిత్రం 'అరవింద సమేత' దుబాయ్ లో సెన్సార్ ను పూర్తి చేసుకోగా, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ, చిత్రం అద్భుతమని తొలి రివ్యూను ఇచ్చాడు. ఎన్టీఆర్ లుక్స్ అద్భుతమని, ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకూ తన క్యారెక్టర్ ను అద్భుతంగా చేశాడని కితాబిచ్చాడు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సూపర్ గా ఉన్నాయని, క్లైమాక్స్ అదరగొట్టిందని అన్నాడు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టిన ఆయన, సినిమాలో డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని, త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి అత్యుత్తమ స్క్రీన్ ప్లే వచ్చిందని అన్నాడు. నందమూరి అభిమానులకు ఈ సినిమా ఓ పండగని, మాస్ స్టోరీతో పాటు, యాక్షన్ సన్నివేశాలు, పాటలు బాగున్నాయని, ఫ్యాన్స్ కు ఈ చిత్రం ఓ మంచి దసరా కానుకని చెప్పాడు.
Aravinda Sameta
Umair Sandhu
First Review
NTR

More Telugu News