New Delhi: నిద్రపోతున్న వారిపై కత్తులతో దాడి.. ముగ్గురి మృతి!

  • పాత కక్షల నేపథ్యంలో దాడి
  • దంపతులతోపాటు కూతురు మృతి
  • ఢిల్లీలో బుధవారం తెల్లవారు జామున ఘటన
నిద్రపోతున్న దంపతులు, వారి పిల్లలపై దుండగులు కత్తులతో దాడి చేశారు. న్యూఢిల్లీ శివారు కిషన్‌ఘడ్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. వివరాల్లోకి వెళితే... గ్రామంలోని వసంత్‌కుంజ్‌లో మిథిలేష్‌, భార్య సియా, కూతురు నేహా, కుమారుడు సూరజ్‌లతో కలిసి నివాసం ఉంటున్నాడు.

బుధవారం తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న మిథిలేష్‌, సియా, నేహ, సూరజ్ లపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో మిథిలేష్‌, సియా, నేహాలు అక్కడికక్కడే మృతి చెందగా, సూరజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడులు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని సందర్శించారు.
New Delhi
surajkunj
murder

More Telugu News