paruchuri: ప్రియుడితో కలిసి భర్తను చంపించేస్తున్నారు .. ఏం సాధిస్తున్నారు?: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, సమాజంలో జరుగుతోన్న కొన్ని దారుణమైన సంఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. "సాధారణంగా భార్యను అనుమానించి భర్త చంపడమనేది చాలాకాలం నుంచి చూస్తూ వస్తున్నాము. కానీ ఈ మధ్య భార్య .. ప్రియుడితో కలిసి భర్తను చంపించిన సంఘటనలు వరుసగా చూస్తున్నాము.

ఒక వివాహ వ్యవస్థను అత్యున్నతంగా గౌరవించే దేశమేదైనా వుందా అంటే అది భారతదేశమే. ఈ దేశంలో ఇష్టం లేకపోతే విడిపోయే హక్కు వుంది. మళ్లీ ఎవరికి వారు వేరే పెళ్లి చేసుకునే హక్కు వుంది. అలాంటి ఈ దేశంలో పుట్టి ఒకరినొకరు చంపుకుంటున్నారు. చంపిన వారం పది రోజుల్లోనే జైలుపాలవుతున్నారు .. మరి ఏం సాధించినట్టు? అందుకే చిన్న చిన్న గొడవలను పెద్దవి చేసుకోకూడదు .. పగలు పంతాలకుపోయి హత్యల వరకూ వెళ్లొద్దు" అని ఆయన చెప్పుకొచ్చారు.  
Go Back to Shorts
paruchuri

More Telugu News