Jana sena: అమిత్ షా నన్ను పక్కన కూర్చోబెట్టుకుని అడిగారు.. ఆయనేమీ నాకు పెదనాన్న కాదు: పవన్ కల్యాణ్

  • పార్టీ నడపడం ఆషామాషీ కాదన్నారు
  • బీజేపీలోకి వచ్చేయమని చెప్పారు
  • ప్రత్యేక హోదా అడిగే దమ్మున్న ఏకైక పార్టీ జనసేన
జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయమని అమిత్ షా తనను ఓసారి పక్కన కూర్చోబెట్టుకుని అడిగారని జనసేన చీఫ్  పవన్ కల్యాణ్ తెలిపారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. 2014లో ఎన్నికలు పూర్తయిన రెండు నెలల తర్వాత షా తనతో మాట్లాడుతూ పార్టీని ఒక్కడివి నడపలేవని, కాబట్టి బీజేపీలోకి వచ్చేయాలని కోరారని పవన్ తెలిపారు.

జనసేన పెట్టింది బీజేపీలోకి వచ్చేందుకు కాదని, గెలిచినా, ఓడినా ప్రజల కోసం నిలబడాలని నిర్ణయించుకున్నట్టు తేల్చి చెప్పానని వివరించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే శక్తి తనకే ఉందని స్పష్టం చేశారు. 2016 నుంచి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ జనసేనేనని పవన్ పేర్కొన్నారు. ఏపీకి బీజేపీ ద్రోహం చేసిందని, తానెప్పటికీ అదే మాట మీద ఉన్నానన్న పవన్.. మోదీ తనకు అన్న, అమిత్ షా తనకు పెదనాన్న కాదని స్పష్టం చేశారు.
Jana sena
Pawan Kalyan
Narendra Modi
Amit shah
Polavaram
West Godavari District

More Telugu News