Manchu Vishnu: మంచు విష్ణుకు బ్రిటీష్ ఎయిర్‌వేస్ క్షమాపణ!

  • బ్రిటీష్ ఎయిర్‌వేస్ ద్వారా లండన్ నుంచి వెనిస్‌
  • లగేజీని లండన్‌లోనే వదిలేసిన సిబ్బంది
  • విష్ణు కోపం అర్థమైందన్న బ్రిటీష్ ఎయిర్‌వేస్
కథానాయకుడు మంచు విష్ణు ఇటీవల లండన్ నుంచి వెనిస్‌కు వెళ్లారు. కానీ ఆయన లగేజీ మాత్రం లండన్‌లోనే ఉండిపోయింది. ఆయన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో లండన్ నుంచి వెనిస్‌కు ప్రయాణించారు. అయితే ఎయిర్ వేస్ సిబ్బంది ఆయన లగేజిని లండన్‌లోనే వదిలేసింది. దీంతో ఆగ్రహించిన విష్ణు వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశారు. ‘‘వెనిస్‌లో దిగాను.. లండన్‌ నుంచి ఇక్కడికి వచ్చాను. నా లగేజీని లండన్‌లోనే వదిలేసినందుకు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు ధన్యవాదాలు. లవ్‌ యు టూ’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీనికి స్పందించిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ విష్ణు కోపం అర్థమైందని.. అసౌకర్యానికి క్షమించాలని కోరింది. ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతుంటాయని.. వీలైనంత త్వరగా తమ బృందం ద్వారా మీ చిరునామాకే లగేజీని పంపిస్తామని విష్ణుకు స్పష్టం చేసింది. అక్టోబర్ 5న హైదరాబాద్ నుంచి లండన్ విమానం ఎక్కానని ఆరోజు కూడా అసౌకర్యానికి గురయ్యానని.. విమానం 5 గంటలు ఆలస్యంగా బయలుదేరిందని విష్ణు ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.


Manchu Vishnu
British Airways
London
Venis
Lugguage
Hyderabad

More Telugu News