Harbhajan Singh: తన అభిమాన నటిని కలసిన హర్భజన్!

  • ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’లో కాజోల్ పేరు సిమ్రన్
  • కాజల్‌ను కలిసిన హర్భజన్
  • ‘హెలికాప్టర్‌ ఈలా’కు ఆల్ ది బెస్ట్
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్.. సిమ్రన్‌ను కలిశారట. అయితే, టాలీవుడ్ నటి సిమ్రన్ కాదులెండి. బాలీవుడ్‌ ప్రముఖ నటి కాజోల్‌ను హర్భజన్ అలా సంబోధించాడు. దీనికి కారణం లేకపోలేదు. ఆమె నటించిన ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రంలో కాజోల్.. సిమ్రన్ పాత్రలో నటించారు. ఆ పేరును ఉద్దేశిస్తూ హర్భజన్ అలా పేర్కొన్నారు. కాజోల్ అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొంటూ ఆమెను కలిసిన విషయాన్ని భజ్జీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

‘నేను సిమ్రన్‌ను కలిసిన వేళ. నాకెంతో ఇష్టమైన నటి. మీరు నటించిన ‘హెలికాప్టర్‌ ఈలా’ సినిమాకు గానూ ఆల్‌ ది బెస్ట్‌’ అని ట్వీట్‌లో పేర్కొన్న భజ్జీ.. కాజోల్‌తో కలిసి దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నారు. కానీ తాను కాజోల్‌ను ఎక్కడ కలిసిందీ మాత్రం భజ్జీ వెల్లడించలేదు. కాజోల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘హెలికాప్టర్ ఈలా’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికిగాను భజ్జీ ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Harbhajan Singh
Kajol
Dilwale Dulhania Lejayenge
Helicopter Eela

More Telugu News