Ponnam Prabhakar: బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు: పొన్నం ప్రభాకర్

  • గతంలో కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు
  • ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ ఉంటారనే నమ్మకం లేదు
  • టీఆర్ఎస్ తో చేతులు ఎందుకు కలిపారో అమిత్ షా చెప్పాలి
2004లో కాంగ్రెస్ తోను, 2009లో మహాకూటమితోనూ పొత్తు పెట్టుకున్న కేసీఆర్... ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ పొత్తుపై విమర్శలు గుప్పిస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇప్పుడు బీజేపీతో కలసి కేసీఆర్ పనిచేస్తున్నారని... ఎన్నికల తర్వాత బీజేపీతోనే కలసి ఉంటారనే నమ్మకం కూడా లేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని... ఈ విషయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గుర్తుంచుకోవాలని చెప్పారు. టీఆర్ఎస్ తో బీజేపీ ఎందుకు చేతులు కలిపిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాయాజాలం బీజేపీ నేతలకు అర్థం కావడం లేదని అన్నారు.
Ponnam Prabhakar
KCR
amit shah
congress
bjp
TRS

More Telugu News