Nara Lokesh: లోకేష్ ను తీసుకుని చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది: విజయసాయిరెడ్డి

  • నాలుగేళ్లలో రూ. 4.5 లక్షల కోట్లను దోచుకున్నారు
  • చంద్రబాబు, లోకేష్ ల పాస్ పోర్టులు స్వాధీనం చేసుకోవాలి
  • రానున్న ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడిస్తారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే... విజయ్ మాల్యా పారిపోయినట్టు తన కుమారుడు లోకేష్ ను తీసుకుని చంద్రబాబు విదేశాలకు పారిపోతారని అన్నారు. చంద్రబాబు ఒక దొంగ అని... ఈ నాలుగేళ్లలో రూ. 4.5 లక్షల కోట్లను దోచుకున్నారని ఆరోపించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చంద్రబాబు, లోకేష్ ల పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ప్రజలు చిత్తుగా ఓడిస్తారని... జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.  
Nara Lokesh
Chandrababu
Jagan
vijayasai reddy

More Telugu News