maoist: చెట్టు తొర్రలో ఆయుధాలు దాచిన మావోయిస్టులు!
- ఆయుధాలను గుర్తించిన సీఆర్పీఎఫ్ బలగాలు
- ఒక బర్మా తుపాకి, ఐఈడీ పేలుడు పదార్థాలు స్వాధీనం
- మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పొడియం ముడాను అరెస్ట్
మావోయిస్టులు తమ ఆయుధాలను ఒక చెట్టు తొర్రలో దాచి పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని చెట్టు తొర్రలో భద్రంగా దాచారు. ఛత్తీస్ గఢ్ లోని వినప అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపును చేపట్టగా... ఈ ఆయుధాలు బయటపడ్డాయి. ఒక బర్మా తుపాకి, ఐఈడీ పేలుడు పదార్థాలను సీఆర్పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
మరోవైపు, ఛత్తీస్ గఢ్ లో పలు విధ్వంసకర ఘటనల్లో కీలకపాత్ర పోషించిన పొడియం ముడా అనే మావోయిస్టును తూర్పుగోదావరి జిల్లా పోలీసులు గత ఆదివారం అరెస్ట్ చేశారు. 2005 నుంచి 2018 వరకు జరిగిన 15 విధ్వంసకర ఘటనల్లో ఆయన పాల్గొన్నాడు. 117 మంది సీఆర్పీఎఫ్ బలగాలను మట్టుపెట్టిన పలు ఘటనల్లో ఆయన కీలక నిందితుడిగా ఉన్నాడు.