appsc: డీఎస్సీ సహా 18 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్

  • ఏపీపీఎస్సీ ద్వారా ఐదారు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
  • అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి లోపు నోటిఫికేషన్
  • గ్రూప్-1, గ్రూప్-2 మారిన సిలబస్ ను వెబ్ సైట్ లో పెడతాం
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. డీఎస్సీతో పాటు పద్దెనిమిది వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించామని ఏపీీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన ఇస్రో అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, అంతరిక్ష ప్రయోగ నమూనాలను పరిశీలించారు.

అనంతరం, మీడియాతో ఉదయభాస్కర్ మాట్లాడుతూ, ఏపీపీఎస్సీ ద్వారా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాల భర్తీ నిమిత్తం అక్టోబర్ నుంచి డిసెంబర్ చివరి లోపు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. నాలుగైదు రోజుల్లో గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల కోసం మారిన సిలబస్ ను ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో వుంచడం జరుగుతుందని తెలిపారు.
appsc
notification
chairman uday bhasker

More Telugu News