amit shah: అమిత్ షాతో పలు అంశాలు చర్చించాం: స్వామి పరిపూర్ణానంద

  • నా ఆసక్తి  ప్రధానం కాదు 
  • వారు ఏం నిర్ణయిస్తారో వేచి చూడాల్సి ఉంది
  • నేను ప్రచారం చేసే విషయం అమిత్ షా నిర్ణయంపై ఉంది 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పలు అంశాలపై చర్చించామని శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, అమిత్ షా ఆహ్వానం మేరకే ఇక్కడికి వచ్చానని, ఆయన నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

తన ఆసక్తి ప్రధానం కాదని, వారు ఏం నిర్ణయిస్తారో వేచి చూడాల్సి ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయడమనేది అమిత్ షా నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, మరోసారి ఆయన్ని కలిసి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పిన పరిపూర్ణానంద, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రచారంపైనా ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
amit shah
swamy paripurnananda
delhi

More Telugu News