jagan: ఏపీకి తదుపరి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగనే!: టీఎస్ మంత్రి నాయిని జోస్యం

  • తన చెంచాలు అసెంబ్లీలో ఉండాలనే కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు 
  • కేసీఆర్ ను తిట్టేందుకే రేవంత్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు
  • మర్రి శశిధర్ రెడ్డికి దమ్ముంటే తలసానిపై పోటీ చేసి గెలవాలి
ఏపీకి తదుపరి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగనే అని తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో తన చెంచాలు ఒకరిద్దరు ఉండాలనే కోరికతోనే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఒక బచ్చా అని... నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ను తిట్టేందుకే రేవంత్ ను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి భూకబ్జాదారుడని ఆరోపించారు. ఎన్నికలకు సంబంధించి ఈసీనే సుప్రీం అని చెప్పారు. కోర్టుకు వెళ్లడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమనే విషయం తేలిపోయిందని అన్నారు. మర్రి శశిధర్ రెడ్డికి దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
jagan
nayini narsimha reddy
chandrababu
Revanth Reddy

More Telugu News