Kurnool District: కర్నూలు జిల్లాలో దారుణం.. భార్యపై అనుమానంతో పిల్లల గొంతు కోసి హత్య

  • జూపాడుబంగ్లాలో ఘటన 
  • కూతురు లిఖిత(7), కుమారుడు మధు(4)ల గొంతు కోసి హత్య
  • దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కర్నూలు జిల్లాలోని జూపాడుబంగ్లాలో దారుణం జరిగింది. బానోజీరావు అనే వ్యక్తి తన భార్యకి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకుని సైకోగా మారిపోయాడు. భార్యపై ఉన్న అనుమానంతో తన ఇద్దరు పిల్లలని దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఏడేళ్ల కూతురు లిఖిత, నాలుగేళ్ల కుమారుడు మధును హత్య చేసిన అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Kurnool District
Andhra Pradesh
Crime News

More Telugu News