telangana: ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల చేస్తాం.. 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించాం: హైకోర్టులో ఈసీ

  • టెక్నాలజీ సాయంతో బోగస్ ఓట్లను తొలగించాం
  • ఈ నెల 12న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తాం
  • తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు
టెక్నాలజీ సాయంతో తెలంగాణలో 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని హైకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

విచారణ సందర్భంగా బోగస్ ఓట్లు అన్నింటినీ తొలగించామని ఈసీ చెప్పింది. ఈ నెల 12న ఓటర్ల తుది జాబితాతో పాటు నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలిపింది. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలను వినిపించారు. 
telangana
ec
election commission
high court

More Telugu News