jd: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఆప్ నుంచి ఆహ్వానం

  • లక్ష్మీనారాయణను ఆహ్వానించిన ఆప్ రాష్ట్ర కన్వీనర్
  • అవినీతి రహిత పాలనను అందించేందుకు కృషి చేయాలని పిలుపు   
  • మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తానని లక్ష్మీనారాయణ చెప్పారన్నఆప్ 
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు జాతీయ పార్టీ ఆప్ నుంచి ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యంత పారదర్శకమైన పాలనను అందిస్తున్న ఆప్ లోకి రావాలంటూ ఆ పార్టీ నేతలు ఆయనను ఆహ్వానించారు. ఆప్ లో చేరి అవినీతి రహిత పాలనను అందించడానికి లక్ష్మీనారాయణ కృషి చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఏపీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకటరామారావు కోరారు.

నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ప్రజల సమస్యలను లక్ష్మీనారాయణ తెలుసుకున్నారని చెప్పారు. విద్యార్థులు, రైతులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తాము నిశితంగా పరిశీలించామని... మార్పు కోసం రాజకీయాల్లోకి వస్తానని ఆయన చెప్పిన మాట ఆధారంగా ఆయనను ఆప్ లోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.  
jd
lakshminarayana
aap
ap

More Telugu News